శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షిస్తోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు 16 నుంచి 26వ తేదీ వరకూ జరగనున్నాయి.ఇప్పటికే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, పసుపు దంచే కార్యక్రమం వంటివి పూర్తయ్యాయి. ఏప్రిల్ 13న పసుపు దంచే కార్యక్రమం జరిగింది. ఈ పసుపును శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో వినియోగించనున్నారు.
ఇక శ్రీసీతారాముల వారి కల్యాణానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ.. జిల్లా యంత్రాంగంతో కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అన్న ప్రసాదాలతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తోంది. అలాగే వైద్య సౌకర్యం, ఆర్టీసీ బస్సులు, ఎక్కడికక్కడ సైన్ బోర్డులు, పార్కింగ్, భద్రత, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు వంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఒంటిమిట్ట కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపే అంకురార్పణ జరగనుంది. ఏప్రిల్ 26న పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఏప్రిల్ 16 : అంకురార్పణ
ఏప్రిల్ 17: శేష వాహనము
ఏప్రిల్ 18 : హంసవాహనము
ఏప్రిల్ 19 : సింహవాహనము
ఏప్రిల్ 20 : హనుమత్సేవ
ఏప్రిల్ 21 : గరుడసేవ
ఏప్రిల్ 22 : కాంతకోరిక, ఎదుర్కోలు ఉత్సవము
ఏప్రిల్ 23 : సీతారామ కల్యాణోత్సవము
ఏప్రిల్ 24 : అశ్వవాహనము
ఏప్రిల్ 25 : ధ్వజారోహణము
ఏప్రిల్ 26 : ఏకాంతసేవ