వీకెండ్‌లో భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ ఏర్పాట్లు..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి క్షణ కాల దర్శనం కోసం గంటల తరబడి భక్తులు వేచి చూస్తుంటారు. నిత్యం వచ్చే వేలాది మంది భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ముందుగా వారికి ఇబ్బంది కలగకుండా క్యూలైన్ మేనేజ్‌మెంట్ చేసే ఆలోచన చేస్తోంది. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులకు వెంకన్న దర్శనం కల్పించాలని భావిస్తోంది. ముఖ్యంగా తిరుమలలో వారాంతంలో భక్తుల రద్దీ పెద్ద ఎత్తున ఉంటుంది. దీని కోసం టీటీడీ చర్యలు చేపట్టింది.

ఈ కార్యక్రమానికి గత వీకెండే కార్యాచరణ ప్రారంభించింది. గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించినట్టు టీటీడీ వెల్లడించింది. వీరందరికీ సజావుగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. నారాయణగిరి షెడ్ల వద్ద ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్‌ను భక్తులకు అందుబాటులోకి తెచ్చి తద్వారా క్యూలైన్‌లో వేచి ఉండే సమయం తగ్గించింది. భక్తులు వేచి ఉండేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు ఉంటాయి. ఇవి నిండిపోయాక భక్తులను ఆలయం బయట కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లలో ఇంతకు ముందు సామాన్య భక్తులు నడవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి లేకుండా సర్వీస్ లైన్‌ను వినియోగిస్తోంది.

Share this post with your friends