వైఖానస అచార్యులు శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి తిరునక్షత్రోత్సవాలు బుధవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగాయి.
తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, వైఖానస దివ్య సిద్ధాంత వర్ధినీ సభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఖానస ఆగమ పండితులు శ్రీ ప్రభాకరాచార్యులు, వైఖానస దివ్య సిద్ధాంత వర్ధనీ సభ అధ్యక్షులు శ్రీ రాఘవ దీక్షితులు, కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు పాల్గొని ఆ ఇద్దరు మహానుభావులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
తిరుమల కొండపై వేసవి రద్దీ అంతకంతకు క్రమక్రమంగా పెరుగుతోంది. పరీక్షా ఫలితాలు వెలువడటంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. దీంతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం చాలా ఆలస్యమవుతోంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక మీదట సర్వదర్శనం సమయాన్ని పెంచడంతోపాటు సామాన్య భక్తులకు శీఘ్రదర్శనం కల్పించాలన్న ఆలోచనతో సిఫారసు లేఖలను రద్దు చేసింది.