ఇవాళ శని జయంతి.. వీరికి పట్టిందల్లా బంగారమే..

ఇవాళే శని జయంతితో పాటు వట సావిత్రి పండుగ. రెండూ ఒకే రోజున కలిసొచ్చాయి. సూర్యుడు, ఛాయాదేవిల తనయుడైన శనీశ్వరుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు. అది ఈ ఏడాది ఇవాళే వచ్చింది కాబట్టి నేడు శని జయంతిని భక్తులంతా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా శని దోషాలతో బాధపడేవారు నేడు శనీశ్వరుడికి పూజ చేస్తే సత్ఫలితాలు లభిస్తాయని అంటున్నారు. అయితే ఇవాళ్టి నుంచి కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుందట, ధృతి యోగం, శివ వాస యోగం జూన్ 6న ఏర్పడనున్నాయి. ఇదే కొన్ని రాశుల వారికి అదృష్టం తెచ్చి పెట్టనుందట. ఆ రాశులేంటో చూద్దాం.

వృషభ రాశి: వట సావిత్రి వ్రతం, శని జయంతి సందర్భంగా వృషభ రాశి వారికి బాగా కలిసిరానుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, శుభవార్తలు, ఆర్థికంగానూ చాలా బాగుంటుంది. పెట్టుబడులకు ఇదే అనువైన సమయం.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు లభించడంతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది.

సింహరాశి: సింహరాశి వారికి ధనలాభం, ఆర్థిక స్థితి బలపడుతుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి.

తులా రాశి: తుల రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. వీరి సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంటా బయటా అద్భుతంగా ఉంటుంది.

మకర రాశి: మకర రాశి వారు కూడా కెరీర్‌లో ప్రకాశవంతంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

Share this post with your friends