ఇవాళ కృష్ణపింగళ సంకటహర చతుర్థి.. ఎవరిని పూజించాలంటే..

ఇవాళ కృష్ణపింగళ సంకటహర చతుర్థి. ఇవాళ వినాయకుడిని పూజిస్తే చాలా మంచి జరుగుతుందట. ముఖ్యంగా పిల్లలు పూజిస్తే చాలా మంచిదట. కృష్ణపింగళ సంకటహర చతుర్థి వ్రతం పిల్లల సంతోషం, శ్రేయస్సు, సంపద వృద్ధికి తోడ్పడుతుందట. అంతేకాకుండా కుటుంబంలోనూ సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయట. ఇక శుభ సమయం ఏంటంటే.. జేష్ఠ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి జూన్ 25, 2024 ఉదయం 1:23 గంటలకు ప్రారంభమై రాత్రి 11:10 గంటలకు ముగుస్తుంది కాబట్టి సాయంత్రం 5:36 నుంచి రాత్రి 8:36 పూజకు అనుకూలంగా ఉంటుంది.

ఇక ఇవాళ ఏకదంత వినాయక రూపాన్ని పూజిస్తారు. ఇవాళ ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిదట. అన్ని రకాల ఆటంకాలు తొలుగుతాయట. ఉపవాసం ఉండి.. నియమానుసారంగా గణేశుడికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం చంద్రుడిని దర్శించుకుని ఉపవాసాన్ని విరమిస్తారు. ఇలా చేయడం వలన గణేశుడి అనుగ్రహం మనపై ఉంటుందని నమ్మకం. ఇవాళ ఉపవాసం ఉండటం వలన మతపరమైన, ఆధ్యాత్మిక పురోగతిని పొందుతారు. అంతే కాకుండా వ్యక్తి మనస్సు, ఆత్మ శుద్ధి అవుతుందట. కాబట్టి ఇవాళ చేసే పూజా కార్యక్రమాల నుంచి.. ఉపవాసం వరకూ అన్నీ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Share this post with your friends