నేడు కృష్టాంగారక చతుర్దశి.. పూజ చేయలేని వారు ఈ మంత్రం పఠించండి..

నేడు కృష్టాంగారక చతుర్దశిని దేశమంతా జరుపుకుంటోంది. అసలు కృష్ణాంగారక చతుర్దశి అంటే ఏంటంటే.. బహుళ పక్షం.. కుజుడికి సంబంధించిన మంగళవారం.. చతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజు. ఇవన్నీ కలిసొచ్చిన రోజును కృష్ణాంగారక చతుర్దశి అంటారు.ఇది ఎంతో విశేషమైన రోజు. రుణ బాధలు, ధనపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, పెళ్లి కాని అమ్మాయి వరుడి కోసం ఈ రోజున కొన్ని పరిహారాలు చేస్తే అన్నీ ఇబ్బందులూ తొలగిపోయి మంచి జరుగుతుందట. ముఖ్యంగా ఇల్లు నిర్మించాలనుకునేవారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తవుతుందట.

మరో విశేషం ఏంటంటే.. ఈ రోజున మధ్యాహ్నం 12:29 గంటల వరకూ రోహిణి నక్షత్రం ఉంటుంది. ఆ తరువాత మృగశిరా నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. ఇది అత్యంత విశిష్టమైన రోజు. 3:56 గంటల నుంచి 6:10 గంటల వరకూ వృశ్చక లగ్నం ఉంది. ఇది కూడా కుజుడికి సంబంధించిన బలమైన లగ్నం. చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. అంటే సంపూర్ణమైన కుజ ప్రభావం ఈ రోజున ఉంటుంది. ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే తప్పక అన్ని సమస్యలూ నెరవేరుతాయట. అలాగే ఉదయం నుంచి సాయంకాలం వరకూ ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిదని చెబుతారు. ప్రదోష సమయంలో రుణ విమోచక అంగారక స్త్రోత్ర పారాయణం కానీ.. సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో కాత్యాయని వ్రతం చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది.

ఒకవేళ ఇవేమీ చేయలేని వారు కుజ గాయత్రీ మంత్రం.. ‘‘ఓం అంగారకాయ విద్మహే.. శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో కుజ ప్రచోదయాత్.. ’’ను సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు పఠిస్తే మంచిది.

Share this post with your friends