ఇవాళ జన్మాష్టమి.. కన్నయ్య లీలల వెనుక పరమార్థం తెలుసా?

శ్రీకృష్ణుడి పుట్టినరోజు నేడు. ధర్మ సంస్థాపన కోసం శ్రీమహావిష్ణువు ద్వారప యుగంలో 8వ అవతారంగా శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఎందరో రాక్షసులను మట్టుబెట్టాడు. కురుక్షేత్రంలో పాండవుల పక్షాన నిలిచి ధర్మ సంస్థాపన గావించాడు. చెరసాలలో జన్మించిన కన్నయ్య పుట్టగానే తల్లికి దూరమయ్యాడు. ఇక కన్నయ్య చిన్ననాటి నుంచే ప్రదర్శించిన లీలలు అన్నీ ఇన్నీ కావు. దేవకీ గర్భాన జన్మించి యశోద చెంత చేరాడు. తన చిలిపి చేష్టలతో అందరికీ దగ్గరయ్యాడు. దేవకి అష్టమ గర్భాన బాలుడు జన్మించాడని తెలుసుకుని అతడిని సంహరించేందుకు కంసుడు పంపిన పూతనను హతమార్చాడు. వెన్న కోసం కన్నయ్య దొంగగా మారాడు.

కన్నయ్య అల్లరిని భరించలేక యశోద రోటికి కట్టేస్తే అలా కూడా గంధర్వులకు శాప విమోచనం కలిగించి కబంధుని వధించాడు. గోపికలు సరస్సులో స్నానమాడుతుండగా వారి వస్త్రాలను అపహరించి పొగడ చెట్టుపై ఏమీ తెలియనట్టు మురళీ గానం చేశాడు. గోపికలు నమస్కరించి మరీ తమ వస్త్రాలను ఇవ్వమని కోరేవారట. అయితే దీని పరమార్థం.. నదీ స్నానమాచరించేటప్పుడు నగ్నం చేయరాదని. కాత్యాయనీ వ్రత సమయంలో యమునా నదిలో గోపికలు వవివస్త్రలై స్నానమాచరించడం వలన వారికి దోషం అంటుకుందట. ఆ దోషాన్ని పోగొట్టేందుకు కన్నయ్య వారి వస్త్రాలను అపహరించాడట. ఆ తరువాత వారు ఏనాడూ వస్త్రాలు లేకుండా స్నానమాచరించలేదట. ఇలా కన్నయ్య లీలలు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే.

Share this post with your friends