ఇవాళ బతుక్ భైరవ జయంతి.. ఇవాళ ఆయన్ని పూజిస్తే ఏం జరుగుతుందంటే..

ప్రతి ఏడాది జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున బతుక్ భైరవ జయంతిగా జరుపుకుంటారు. ఈ లెక్కన ఇవాళే బతుక్ భైరవ జయంతి. దీని గురించి దక్షిణాది ప్రజానీకానికి పెద్దగా తెలియదు కానీ ఉత్తరాది వారికైతే బాగా తెలుసు. వీరు పెద్ద పండుగలా దీనిని జరుపుకుంటారు. బతుక్ భైరవ జయంతి రోజున ఏ దేవున్ని పూజించాలనే కదా మీ డౌట్.. ఉగ్రరూపంలో ఉన్న పరమశివుని కానీ కుక్కని కానీ పూజించాలి. ఈ రోజు పరమశివుడు భైరవుడిగా అవతరించాడు కాబట్టే ఈ రోజున భైరవ పూజను నిర్వహించాలి. శివుడు, భైరవుడు వేరు కాదని శివుని సంపూర్ణ స్వరూపమే శివుడని భైరవ పురాణం చెబుతోంది.

బతుక్ భైరవ జయంతి రోజు భైరవుని వాహనమైన కుక్కను పూజించాలి. నల్ల కుక్కకు ఆవనూనెతో కాల్సిన రోటీలతో పాటు ఇతర ఆహార పదార్థాలను పెట్టాలట. ఇలా చేస్తే శని దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందట. కుక్కకు ఆహార పదార్థాలు తినిపించేటప్పుడు ‘ఓం బతుక్ భైరవాయ నమః’ అని స్మరిస్తూ ఉండాలి. జాతక దోషాలను తొలగించుకోవడానికి బతుక్ భైరవ జయంతి రోజు పరమశివుని పూజించాలి. అలాగే ఇవాళ శివునికి ఆవు పాలతో అభిషేకం జరిపించినా కూడా సకల మనోభీష్టాలు నెరవేరుతాయని చెబుతారు. ఇక శత్రు నాశనం కోసం తెల్లని పూలు, అరటిపండ్లు, లడ్డూలు, పాయసం, పంచామృతాలు వంటివి భైరవుడికి సమర్పిస్తే కార్యజయం, శత్రునాశనం ఉంటాయి.

Share this post with your friends