షాకింగ్ స్థాయిలో తిరుమల శ్రీనివాసుని ఆదాయం.. తొలి ఆరు నెలల్లో ఎంతంటే..

తిరుమల శ్రీనివాసుని ఆదాయం షాకింగ్ స్థాయిలో ఉంది. ఈ ఏడాది అయితే ఏ నెల కూడా 100 కోట్ల రూపాయలకు తగ్గిందే లేదు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అలాగే తిరుమల వెంకన్న ఆదాయమూ పెరుగుతోంది. స్వామివారి 6 నెలల హుండీ ఆదాయాన్ని తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. స్వామివారికి మొత్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల ఆదాయం రూ. 670.21 కోట్లు వచ్చింది. ఇక నెలల వారీగా చూస్తే.. జనవరిలో రూ 116.46 కోట్లు, ఫిబ్రవరిలో రూ 111.71 కోట్లు, మార్చి నెలలో రూ 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ 101. 63 కోట్లు, మే నెలలో రూ 108.28 కోట్లు, జూన్ నెలలో రూ 113.64 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

ఈ క్రమంలోనే శ్రీ మలయప్ప స్వామివారికి ఏడు నెలల క్రితం ఉన్న ఆస్తుల వివరాలను.. బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్లతో సహా టీటీడీ వెల్లడించింది. 2023 అక్టోబర్ 31 నాటికి రూ. 17,816.15 కోట్ల నగదు ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. 11,225.66 కేజీల గోల్డ్ డిపాజిట్‌లు ఉన్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇక ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా 10786.67 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 438.99 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసినట్టు టీటీడీ తెలిపింది. మొత్తానికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆదాయం రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది.

Share this post with your friends