ఒంటిమిట్ట శ్రీ‌సీతా రాముల‌ కల్యాణానికి తిరుమ‌ల ల‌డ్డూ సిద్ధం

ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో మినీ (25 గ్రాముల) లడ్డూల ప్యాకింగ్‌ను శుక్ర‌వారం నిర్వహించారు. డెప్యూటీ ఈవో (జనరల్‌) శ్రీ శివప్రసాద్‌, పోటు ఏఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 250 మంది మహిళా, పురుష శ్రీ‌వారి సేవ‌కులు 1.20 ల‌క్ష‌ల లడ్డూలను 60 వేల జిప్‌లాక్‌ ప్యాకెట్లలో ఒక్కో ప్యాక్‌లో రెండు లడ్డూలు ఉంచారు.

కడపజిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభ‌వంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.

Share this post with your friends