పెళ్లికాని వారు, పిల్లలు లేని వారు ఇవాళ హనుమంతుడిని ఇలా పూజించండి..

ఇవాళ హనుమత్ జయంతి. ఈ పండుగను తెలుగు రాష్ట్రాలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాయి. వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి, పూర్వాభాద్ర నక్షత్రం రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటాం. ఇక తిథి నేటి ఉదయం 7:24 గంటలకు ప్రారంభమై జూన్ 2వ తేదీ ఉదయం 5:04 గంటలకు ముగుసతుంది. ఇవాళ హనుమంతుడి జయంతి రోజున శనీశ్వరుడికి పూజ చేస్తే శని దోషాల నుంచి సైతం బయటపడవచ్చట. హనుమంతుని అధిపతి అయిన శనీశ్వరుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి హనుమంతుడి నుంచి వరాలు పొందేందుకు ఇదే అత్యంత శుభ సమయమని నమ్ముతారు.

హనుమంతుడిని విధేయత, శక్తికి ప్రతీకగా కొలుస్తుంటాం. ఏ పనిలో అడ్డంకులు ఏర్పడినా స్వామివారిని పూజిస్తే అవన్నీ తొలగిపోయి ఆ పని సక్సెస్ అవుతుందట. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి పూజలు చేస్తే ఆర్థిక సమస్యలు ఉండవట. హనుమాన్ చాలీసా పఠిస్తే అనుకున్నది నెరవేరుతుందట. వివాహం ఆలస్యం అవుతున్న వారంతా సుందర కాండను పఠించినా.. మంచి జీవిత భాగస్వామిని పొందడానికి హనుమంతుడికి సిందూరాన్ని, మిఠాయి సమర్పించడం వలన శుభఫలితాలు పొందుతారు. సంతానం లేని దంపతులు సైతం ఇవాళ స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తారు. ఇవాళ హనుమంతుడికి ఇష్టమైన అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించి.. బజరంగ్ బాన్ పఠిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం.

Share this post with your friends