చార్దామ్ యాత్రలో కేదార్‌నాథ్ దామ్ కూడా ఒకటి. అయితే కేదార్‌నాథ్‌కు వెళ్లే వారు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లడానికి ముందు ధరి దేవి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఈ ఆలయం శ్రీనగర్ గర్వాల్, రుద్ర ప్రయాగ్ మధ్య కాలియా సౌద్ అనే ప్రదేశంలో అలకనంద నది మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకోకుంటే కేదార్‌నాథ్ దామ్ యాత్ర పూర్తి కాదని అంతా భావిస్తుంటారు. కాబట్టి కేదార్‌నాథ్‌కు వెళ్లే వాళ్లు తప్పక ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
ఇక ఈ యాత్రలో భాగంగా మనం దర్శించుకోవల్సిన ముఖ్య ఆలయాల్లో విశ్వనాథ్ ఆలయం ఒకటి. ఇది గుప్త కాశీలో ఉంది. ఈ ఆలయం కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడే పరమేశ్వరుడు పార్వతీ మాతకు వివాహ ప్రతిపాదన చేశాడని అక్కడి వారు చెబుతుంటారు. ఇక ఆ తరువాత శంకరాచార్య సమాధి. ఇది కేదార్‌నాథ్ ఆలయం వెనుకే ఉంటుంది. ఇక్కడ ఉన్న ధ్యాన ప్రదేశంలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇక కేదార్‌నాథ్‌లో మహాశివుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో భైరవనాథ్ ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. భైరవనాథ్ ఆలయం కేదార్‌నాథ్ ఆలయానికి దాదాపు 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి భైరవనాథుడిని కేదార్‌నాథ్ ధామ్‌కు క్షేత్రపాలకుడని చెబుతుంటారు. ఇవన్నీ పూర్తి చేసుకుంటే యాత్రం సంపూర్ణమైనట్టే.