ఈసారి మాస శివరాత్రి వెరీ స్పెషల్.. అదెప్పుడంటే..

హిందూ మతంలో ప్రతి నెల కృష్ణ పక్షంలోని చతుర్దశి తిధిన మాస శివరాత్రిని జరుపుకుంటాం. ఈ రోజున మహిళలంతా ఉపవాసం ఉటారు. ఈ రోజున వివాహితలు ఉపవాసం చేస్తే వారి భర్తలు దీర్ఘాయుష్షుతో ఉంటారట. పెళ్లి కాని యువతులు చేస్తే వెంటనే వివాహం జరుగుతుందట. ఆది దంపతులైన శివపార్వతులను ప్రసన్నం చేసుకునేందుకు మాస శివరాత్రి ఒక మంచి రోజని చెబుతారు. మాస శివరాత్రి పరమశివుడు, పార్వతిదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈసారి మాస శివరాత్రి రోజున మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ రోజున కొన్ని ప్రత్యేక యాదృచ్చికాలు ఏర్పడనున్నాయి.కాబట్టి ఈ రోజున పూజలు చేస్తే ఫలితం మరింత బాగుంటుందట. అయితే పూజకు పెద్దగా అనుకూలమైన సమయం లేదు. కేవలం 48 నిమిషాలు మాత్రమే ఉంది. భాద్రప్రద మాసం కృష్ణ పక్ష చతుర్దశి తిథి సెప్టెంబర్ 30న రాత్రి 07:06 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 01వ తేదీ రాత్రి 09:39 గంటలకు ముగుస్తుంది. కాబట్టి మాస శివరాత్రిని సెప్టెంబర్ 30 న జరుపుకుంటారు. మాస శివరాత్రి పూజా సమయం రాత్రి 11:47 నుంచి 12:35 వరకూ.. అంటే కేవలం 48 నిమిషాల సమయం మాత్రమే పూజకు అనువుగా ఉంటుంది.

Share this post with your friends