ఈ దేవాలయం మందుబాబులకు వెరీ స్పెషల్.. ఎందుకంటే..

అనంతపురం జిల్లాలో ఓ ఆలయం ఉంది. ఆ ఆలయానికి తాగుబోతులు క్యూ కడతారు. వాస్తవానికి ఈ ఆలయం గురించి తెలియని మందుబాబు ఉండరట. గుడికి.. మందుబాబులకి సంబంధం ఏంటి? అసలు అక్కడ ఏ దేవుడు కొలువై ఉన్నాడు? ఏంటనే విశేషాలను తెలుసుకుందాం. ఆంధ్ర పుండరీపురంగా పిలవబడే ఉంతకల్లులో పాండురంగ స్వామి కొలువై ఉన్నాడు. ఈ స్వామివారిని కొలిస్తే చాలు ఎంతటి తాగుబోతైనా తాగుడు మానేస్తాడట. ముఖ్యంగా నెలలో రెండు రోజులు ఇక్కడికి తాగుబోతులు పోటెత్తుతారు.

అయితే మందుబాబులు మందు అలవాటుకు చెక్ పెట్టాలంటే స్వామివారి మాల వేయాల్సిందేనట. మాల ధారణ సమయంలోనే కాకుండా మాల తీసేసిన తర్వాత కూడా మందు జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరట. ఇక ఈ మాలను నెలలో కేవలం రెండు రోజులు మాత్ర వేస్తారు. శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజుల్లోనే పాండురంగ స్వామి మాల ధరించాలి. తాగుడుకు బానిస అయిన వారు మాత్రమే స్వామివారి మాలను ధరిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. ముఖ్యంగా మందుబాబులైతే డి అడిక్షన్ సెంటర్‌కు వెళ్లడం మానేసి ఈ ఆలయానికి వెళుతున్నారట.

Share this post with your friends