ఇక్కడే శివుడు రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటాడట.. పార్వతీదేవితో పచ్చీసు ఆడతాడట..

ఓ ఆలయంలో శివుడు రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటాడట. అందుకే ఆయన కోసం మంచం కూడా వేస్తారు. ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకుంది. ఓం ఆకారంలో ఉండే ద్వీపంలో ఉంటాడీ శివయ్య. అందుకే ఆయనను ఓంకారేశ్వరుడని పిలుస్తారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మధ్యలో మాంధాత అనే ద్వీపంలో ఈ ఓంకారేశ్వర ఆలయం ఉంది. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ స్వామివారు ఓంకారేశ్వర, మమలేశ్వర రూపాలలో పూజలందుకుంటాడు. ఇక ఇక్కడి శివయ్య విశేషాలు చాలానే ఉన్నాయి. శివుడు రోజూ రాత్రి సమయంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంలో విశ్రాంతి తీసుకుంటాడని నమ్మకం.

అందుకనే ఈ ఆలయం లోపల శివుడు నిద్రించేందుకు వీలుగా మంచం వేస్తారు. మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ శివయ్య పార్వతీమాతతో పచ్చిసీ ఆడుతాడట. అందుకే పచ్చీసు ఆటకు ఏర్పాట్లు చేసి మరీ ఆలయ తలుపులను రాత్రివేళ మూసివేస్తారు. ఇక ఆలయ తలుపులు మూసేశాక అటు వైపుగా ఎవరూ వెళ్లరు. ఇక పచ్చిసీ ఆడుతారనడానికి నిదర్శనంగా ఉదయానికి పాచికలన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటంతో పాటు పాచికలు ఆడినట్టు స్పష్టమైన ఆనవాళ్లు కనిపిస్తాయట. ఇక ఇక్కడి నర్మదా నదిలో స్నానమాచరించి శివయ్యను పూజించుకుంటే సకల పాపాలు నశిస్తాయట. ఇక్కడ పూజలు చేస్తే ఆధ్మాత్మిక బలం కూడా లభిస్తుందని నమ్మకం.

Share this post with your friends