పార్వతీదేవి మణి పొదిగిన చెవిపోగు పడిన ప్రాంతమే ఇదేనట..

మణికరణ్ శివాలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడి పార్వతీమాత నదిలో స్నానమాచరిస్తే ఎలాంటి చర్మ సంబంధిత సమస్య అయినా తొలగిపోతుందని నమ్మకం. ఈ ఆలయంలో శ్రీరాముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం పూజలు నిర్వహించారని చెబుతారు. అలాగే ఈ స్థలం హిందువులకే కాకుండా సిక్కులకు సైతం పవిత్ర స్థలం. ఇక్కడ గురు ద్వారా కూడా ఉండి. ఈ ఆలయ స్థల పురాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పురాణ కథనాల ప్రకారం పార్వతి దేవి నదిలో స్నానం చేస్తుండగా పార్వతి చెవిపోగులు నదిలో పడిపోయాయట.

శివుడు ఆ చెవిపోగులను వెతుకుతుంటే అవి ఎంతకు దొరకలేదట. ఆ చెవిపోగు శేషనాగుకు దొరికిందట. శేషనాగుడు పార్వతి దేవి చెవిపోగు తీసుకుని పాతాళంలోకి వెళ్లిపోయాడట. చెవిపోగు కనబడక, శేషనాగుడు సైతం కనిపించకపోవడంతో శివుడికి విషయం అర్థమై తీవ్ర కోపం వచ్చిందట. అంతే.. మూడవ కన్ను తెరిచాడట. మూడవ కన్ను నుంచి వెలువడిన వేడి నీకు కారణంగా పార్వతీ నదిలోని నీరు వేడెక్కడం మొదలైందట. శివుడి కోపాగ్నికి తాళలేక శేషనాగు వచ్చి పార్వతీ మాత చెవిపోగును తిరిగి ఇచ్చేశాడట. ఆ చెవి పోగు మణి పొదిగినది కావడంతో ఆ చెవిపోగు పడిన ప్రాంతాన్ని మణికిరణ్ అని అంటున్నారు. ఆ నదిని కర్ణపూల్ అని కూడా పిలుస్తారు.

Share this post with your friends