శబరిమలలో ఈ నెల 26న మండల పూజ నిర్వహించనున్న విషయం తెలిసిందే. మండల పూజ సమయంలో గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. మండల పూజ సమయంలో ఉపవాసం ఉండాలి. అలాగే ఆ సమయంలో స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలి. ఉపవాస రోజుల్లో శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి. భక్తులు 41 రోజులపాటు ప్రాపంచిక సుఖాలను వదులుకుని జీవించడంతో పాటు మద్యపానం, ధూమపానం జోలికి వెళ్లరు. భక్తులు రోజుకు రెండుసార్లు అయ్యప్ప స్వామికి పూజ చేస్తూ ప్రార్థనలు చేయాలి. దీక్ష పూర్తైన మీదట ‘ఇరుముడి’ సమర్పించాలి. పాదరక్షలు ధరించడం, మంచంపై నిద్రించడం, దీక్ష సమయంలో దానధర్మాలు వంటివి చేయకూడదు.
ఇప్పుడు మండల పూజ ప్రాముఖ్యతేంటో తెలుసుకుందాం. శబరిమల ఆలయంలో నిర్వహించే మండల పూజ చాలా ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుంచి భక్తులు పూజల సమయంలో శబరిమలకు వస్తుంటారు. మండల పూజ సమయంలో ఆలయం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. కాబట్టి స్వామివారి దర్శనం భక్తులు ఏ సమయంలోనైనా భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. ఈ మండల పూజ గురించి అనేక పురాణాలలో ప్రస్తావించడం, దాని ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. నమ్మకాల ప్రకారం మండల పూజ చేసే వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోతుంది. అయ్యప్ప స్వామి తన భక్తుల పూజకు సంతోషించి కోరికలన్నింటినీ తీరుస్తాడని నమ్మకం.