శ్రీవారి ఆలయ మాఢవీధుల్లో ఊరేగిన శ్రీ భాష్యకార్ల వారు

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాత్తుమొర వైభవంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడక దారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు.

సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends