మన ఇంట్లో వాస్తు దోషాలు అన్నింటి గురించి మనకు తెలియకపోవచ్చు. అంటే వాటిని మనం గుర్తించం. తత్ఫలితంగా మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. ఇలా ఎన్ని ఇబ్బందులున్నా కూడా మనల్ని వాటి నుంచి ఒక చెట్టు గట్టెక్కిస్తుందట. ఆ చెట్టు ఉంటే ఎలాంటి వాస్తు దోషమూ ఉండదట. పైగా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందట. ఈ చెట్టు ముఖ్యంగా శనీశ్వరుడికి చాలా ముఖ్యమైంది కాబట్టి మనకు అసలు ఇబ్బందులే ఉండవట. ఇంతకీ ఏంటా చెట్టు అంటారా? జమ్మి చెట్టు. దీనిని ఇంట్లో పెంచుకుంటే ఆనందం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయట. ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున ఈ చెట్టు నాటితే చాలా మంచిదట.
ఒకవేళ ప్రధాన ద్వారం వద్ద మొక్క నాటేంత ప్లేస్ లేకుంటే.. ఇంటి మేడపై అయినా దక్షిణం వైపున జమ్మి చెట్టును నాటాలట. ఇక ఈ మొక్కను ఎప్పుడు పడితే అప్పడు నాటిన దాని కంటే ప్రత్యేంగా ఓ రోజున నాటితే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అదేంటంటే.. విజయదశమి నాడు. ఆ రోజున వీలు పడలేదంటే శనివారం నాటవచ్చు. నాటిన నాటి నుంచి చక్కగా సంరక్షించుకోవాలి. క్రమం తప్పకుండా పసుపు, కుంకమలతో పూజించాలి. ప్రతిరోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద ఆవనూనెతో దీపం వెలిగించారో ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అన్నీ పరారవుతాయట. ఇక శమీ చెట్టును ఎర్ర కలువ పూలతో పూజిస్తే జాతకంలో రాహుస్థానం బలపడుతుందట.