శ్రీరామనవమి నుంచి వీరి లైఫ్ అద్భుతంగా ఉండబోతోందట..!

హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటి. ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామనవమి పండుగను దేశమంతా అంగరంగ వైభవంగా జరుపుకోనుంది. ఈ రోజుతో చైత్ర నవరాత్రులు సైతం ముగియనున్నాయి. అయితే శ్రీరామనవమి నుంచి కొందరి లైఫ్ మాత్రం అద్భుతంగా మారబోతోందట. వారెవరు? ఎందుకు వారి లైఫ్ అద్భుతంగా మారబోతోందో చూద్దాం. శ్రీరామ నవమి రోజున గ్రహాల సంచారం కూడా మారబోతోందట. దేవ గురువుగా భావించే బృహస్పతి నక్షత్రం మార్చుకోబోతున్నాడట. దీంతో కొందరికి అద్భుతంగా లైఫ్ టర్న్ కారనుంది. ప్రస్తుతం భరణి నక్షత్రంలో సంచరిస్తున్న బృహస్పతి 17న కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

ఇక కృతిక నక్షత్రంలో బృహస్పతి జూన్ 13 వరకూ ఉండటంతో పాటు ఆ సమయంలోనే మేష రాశి నుంచి వృషభరాశిలోకి సంచరిస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి లాభాల పంట తెచ్చి పెడుతుందట. ఇక ఆ రాశులేంటంటే.. మేష, సింహ, తుల, వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుందట. మేషరాశి వారికి ఆర్థిక పురోగతి, సంపద వృద్ధి ఉంటుంది. సింహరాశి వారికి 17 నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. అప్పటి నుంచి అదృష్టం వారి వెంటే ఉంటుందట. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయట. తులా రాశివారికి అనారోగ్య సమస్యలన్నీ తొలిగిపోతాయట. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుందట. ఇక వృశ్చిక రాశి వారికి వ్యాపారం బాగా కలిసి రావడంతో పాటు అపారమైన లాభాలు గడిస్తారట. బకాయిపడిన డబ్బు చేతికి అందుతుందట. ఉద్యోగులకు సైతం అద్భుతంగా ఉంటుందట.

Share this post with your friends