సీతమ్మ అగ్నిప్రవేశం చేసిన చోట సైన్స్‌కందని మిస్టరీ.. అదేంటంటే

ప్రతి ఒక్క దేవాలయానికీ ఓ ప్రత్యేకత అయితే ఉంటుంది. బీహార్‌లోని ముంగేర్‌లో రామాయణానికి సంబంధించిన ఆలయాలకు కొదువ లేదు. అయితే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆ అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం కూడా బీహార్లోనే ఉందని చెబుతారు. అదే సీతా కుండ్. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశంలో ఓ కొలను ఏర్పడిందని నమ్ముతారు. ఈ కొలనులోని నీరు వసంత కాలం సహా ఏడాది పొడవునా ఎప్పుడు చూసినా వేడిగానే ఉంటుందట. ఈ ప్రదేశాన్ని రామతీర్థం అని కూడా అంటారు. అయితే ఈ కొలనులో నీరు ఎప్పుడూ ఎందుకు వేడిగా ఉంటుందంటారా?

అది ఎవరి ఊహకూ అందని రహస్యం. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో సీతాకుండ్‌తో పాటు రాముడు, లక్ష్మణుడు, భరత్, శత్రుఘ్న పేర్లతో కొలనులు కూడా ఉన్నాయి. కానీ సీతాకుండ్ మినహా ఏ కొలనులోని నీరు వేడిగా ఉండదు. శాస్త్రవేత్తలు సైతం ఎందుకు ఈ కొలనులోని నీరు వేడిగా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చెరువు పొడవు, వెడల్పులు ఎంతున్నాయనేది మాత్రం తెలుసుకోగలిగారు కానీ మిస్టరీని మాత్రం ఛేదించలేకపోయారు. అయితే వేసవిలో మాత్రం నీటి ఉష్ణోగ్రత కొంత మేర తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏడాది పొడవునా సీతా కుండ్‌ని ప్రజలు సందర్శిస్తూనే ఉంటారు.

Share this post with your friends