సూర్యప్రభ వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా ద్వాదశ సూర్యదేవ గణాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ పెద్ద ఎత్తున జరిగింది. ఈ వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 12 కళాబృందాలు 257 మంది కళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. ఈ ప్రదర్శనలు భక్తులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ద్వాదశ సూర్యదేవ గణాల ప్రదర్శనలో ఒక్కో విద్యార్థి ధాత, ఆర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వంత, అంశుమంత, త్వస్త, విష్ణువు, భగ, పూష, క్రతువులతో సహా ఒక్కో సూర్యదేవ గణాన్ని ప్రదర్శించి భక్తులను ఆహ్లాదపరిచారు. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన 15 మంది కళాకారులు యక్షగానం, 25 మంది యువతులు ‘మహాలక్ష్మి స్తుతి’, భరతనాట్యం నేత్రపర్వంగా సాగింది. డప్పుతోపాటు కోలాటం, కడప డ్రమ్స్ భక్తులలో మరింత భక్తి భావాన్ని పెంపొందించింది.

Share this post with your friends