త్రిమూర్తులు ఈ వినాయకుడిని ప్రతిష్టించారట.. ఈయన విశిష్టతలేంటో తెలిస్తే..

కురుడుమలె వినాయకుడి గురించి విన్నారా? ఈ స్వామివారికి మొక్కితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. అసలు ఎక్కడుందీ కురుడమలె అంటారా? కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారని చెబుతారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎక్కడైనా వినాయకుడి మహా అయితే 3 – 5 అడుగులు ఉంటుంది. కానీ ఇక్కడ దాదాపు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏక సాలగ్రామ శిలతో ఈ భారీ విగ్రహం రూపొందింది. ఈ విగ్రహాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రతిష్టించారని అక్కడి వారి చెబుతుంటారు.

త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని ప్రతిష్టించి పూజలు నిర్వహించి ఆపై విజయం అందుకున్నారని ప్రతీతి. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు లంకకు వెళ్లడానికి ముందు ఈ స్వామివారిని సేవించారట. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, పాండవులు సైతం ఈ గణపయ్యను పూజించారని చెబుతారు. మొత్తం ఏకశిలతోనే నిర్మితమైన ఈ ఆలయం 2000 ఏళ్ల క్రితం నాటిదని అంటుంటారు. ఇక్కడి వారు మరో విషయాన్ని కూడా గట్టిగా నమ్ముతారు. కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటీకి ఉన్నారని, ప్రతి రాత్రి వచ్చి స్వామిని దర్శంచుకుంటారని భావిస్తూ ఉంటారు. దీనికి ఆధారాలను కూడా వారు చూపిస్తున్నారు. అప్పుడప్పుడు రాత్రి వేళల్లో ఈ ఆలయం నుంచి ఏవో మంత్రాలతో పాటు ఓకారం వినిపిస్తూ ఉంటుందని చెబుతారు.

Share this post with your friends