గురువు కుమార్తె లీల.. అయ్యప్పను ప్రేమించిందట..

అయ్యప్ప స్వామిని దర్శించుకునే వారికి 18 సంవత్సరాలు.. 18 పేర్లున్నాయని తెలుసుకున్నాం కదా. ప్రతి సంవత్సరం, స్వామి వారి ఆశీస్సులు పొందడానికి భక్త జన సమూహం శబరిమలకు ఇక్కడికి తరలి వస్తారు. అయ్య‌ప్ప‌ స్వామికి వివిధ పేర్లున్నాయి. అవేంటంటే.. హరిహరసుతుడు, ధర్మశాస్త, మణికంఠుడు. అయ్యప్ప స్వామి దేవతలను వేధిస్తున్న మహిషి అనే రాక్షసిని చంపి శబరిమలైలో వెలిశాడని చెబుతారు.అయితే బ్రహ్మచారి అయిన అయప్పను వివాహం చేసుకోవాలని ఒక దేవత చాలా కాలంగా వేచి చూస్తోందని మనం ఇప్పటికే తెలుసుకున్నాం.

ఆమెకు కూడా శబరిమలలో చిన్న దేవాలయం కూడా ఉంది. ఆమె ఎవరనేది మనం తెలుసుకున్నాం. ఆమె పేరు మల్లికాపురథమ్మ. బ్రహ్మచారి అయిన మణికంఠుడిని వివాహం చేసుకోవాలనుకొన్నది ఆమె కోరిక. పందల రాజు తనకు దొరికిన అయ్యప్పను కలరి విద్య నేర్చుకోవడం కోసం ఓ విద్యాలయంలో శిష్యునిగా చేర్పించాడట. ఆ గురుకులం గురువు కుమార్తె లీలా అయప్పను ప్రేమించిందట. అయితే అయ్యప్పస్వామి బ్రహ్మచర్యంలో ఉన్న ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. ఆ సమయంలోనే ఆమెకు అయ్యప్ప స్వామి మాటిచ్చాడట. ఎప్పుడైతే శబరిమలకు కన్నెస్వాముల రాక ఉండదో ఆ రోజు ఆమెను పెళ్లి చేసుకొంటానని మాట ఇచ్చాడట. దీంతో ఆ దేవత కన్యస్వాములు వస్తున్నారో రారో చూడటం కోసం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం పక్కనే మల్లికాపురథమ్మ పేరుతో వెలిసిందట. అయ్యప్ప క్షేత్రానికి వెళ్లిన వారు మల్లికాపురథమ్మ ఆలయాన్ని సైతం చూడొచ్చు.

Share this post with your friends