ఈ శివాలయం స్పెషాలిటీయే వేరు.. శాస్త్రవేత్తలకు సైతం మిస్టరీయే..

మన చుట్టూ ఆలయాలు ఎన్ని ఉన్నా కూడా.. శివాలయం అనేది ప్రత్యేకం. ప్రతి ఆలయం కూడా ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. కొన్ని రహస్యాలను తమలో దాచుకుని ఉంటుంది. వాటిని అర్థం చేసుకోవడం సామాన్యులకే కాదు.. సైంటిస్టులకూ కష్టమే. అలాంటి ఆలయాల్లో ఒకటి ఛత్తీస్‌గఢ్‌లోని ఖరోడ్‌లోని లక్ష్మణేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయంలో శివలింగానికి లక్షా 25 వేల రంధ్రాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రత్యేక రంధ్రం ఉంది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఈ శివలింగంపై ఎంత నీరు పోసినా సరే బయటకు మాత్రం పొంగి పోవడం ఉండదు. ఎంత నీరు పోసినా నీటిమట్టం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది.

అయితే శివలింగానికి ఉన్న ప్రత్యేక రంధ్రమే మొత్తం నీటిని ఒకేసారి పీల్చుకుంటుందని అంటారు. ఈ రంధ్రాన్ని పాతాళం అంటారు. ఎప్పుడూ నీటితో నిండి ఉండే ఈ గుడిలో రంధ్రాలు ఎలా వచ్చాయనేది ఎవరికీ అంతుపట్టని విషయం. గుడి గుంతల ద్వారా నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయినా సరే.. ఆలయంలో నీరు మాత్రం తగ్గదు. ఇది నేటికీ శాస్త్రవేత్తలు గుర్తించలేకపోతున్నారు.ఈ ఆలయం రామాయణ కాలంలో నిర్మించబడిందని ప్రతీతి. ఖరోడ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని కాశీ అని పిలుస్తారు. లక్ష్మణుడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. అందుకే శివలింగాన్ని లఖేశ్వర్ మహాదేవ్ అని కూడా అంటారు.

Share this post with your friends