పదునెట్టాంబడి విశిష్టత ఏంటంటే..

సాధారణంగా అయ్యప్ప స్వామి దీక్ష 18 సంవత్సరాలు చేస్తే చాలా మంచిదని చెబుతారు. దీని పరమార్థం ఏమిటంటే.. ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు మీద ఒక్కో దుర్గుణాన్ని విడిచి పెట్టడమేనట. ఈ విషయాన్ని శబరిమల స్థలపురాణం చెబుతోంది. నిరంతర సాధన, కఠోర దీక్షతో ఇది సాధ్యమని గురు స్వాములు చెబుతారు. దీనికి అనుగుణంగానే మాలధారణ నియమాలుంటాయి. అరిషడ్వార్గాలను విడిచి ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుకోవడమే మాలధారణ పరమార్థం. ముఖ్యంగా తమో, రజో గుణాలను విడిచి పెట్టి జ్ఞానమార్గంలో పయనించడమే పదునెట్టాంబడి అధిరోహించడంలోని అంతరార్ధం.

అయ్యప్ప సన్నిధానానికి చేరుకునే ఈ 18 మెట్లను ఇరుముడి లేకుండా మాత్రం అధిరోహించలేరు. ఒకవేళ ఇరుముడి లేకుండా కేవలం స్వామివారి దర్శనానికి వెళ్లినవారు ఉత్తరం వైపు ఉన్న మెట్ల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. 18 మెట్లను ఇరుముడి లేకుండా ఎవరూ సన్నిధానాన్ని చేరుకోలేరా? అంటే.. ఆలయ అర్చకులు మినహా ఎవరికీ ఆ అర్హత అయితే ఉండదు. దీనికోసం ఆలయ అర్చకులు ఒక సంవత్సర కాలం పాటు దీక్ష చేయాల్సి ఉంటుంది. ఇక మకర సంక్రాంతి పండుగనాడు అయితే ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ముఖ్యంగా మాలధారణ గావించిన వారిలో ఎక్కువ మంది జ్యోతి దర్శనానికి వెళతారు.

Share this post with your friends