
వారాహి నవరాత్రి దీక్ష చేసేవారు ఆహార నియమం పాటించాలి (ఉపవాసం చేయకండి పూజ ఐయ్యాక తినవచ్చు). వారాహి నవరాత్రి పూజను రెండు పూటలా ఉదయం సాయంత్రం చేయాలి. బ్రహ్మచర్య నియమాలు పాటించాలి. ఆ పది రోజులు ఇంట్లో శాకాహారమే వండాలి. వండిన ప్రతి పదార్థాలను నైవేద్యం గా పెట్టి ప్రసాదంగా తినాలి. ఆ పది రోజులు అఖండ దీపం ఉంటే మంచిది. వారాహి పాడి పంటలకు, భూమికి సంబంధించిన శక్తి కనుక.. మొదటి రోజు కొత్త కుండలో మట్టి వేసి నవధాన్యాలు వేయండి ఆ మట్టితో నిండిన పాత్రను పూజలో ఉంచలి పదవ రోజుకి మొలకలు ఆరోగ్యంగా మొలిస్తే మీ సంకల్పం ఆటంకాలు లేకుండా నెరవేరినట్టు.. తర్వాత అవి అవుకి తినిపించాలి.
పసుపు గణపతిని ప్రతి రోజూ చేయాలి.. ఆ గణపతిని చేసిన పసుపు వినియోగించుంకోవచ్చు. విగ్రహం ఉన్నవారు రోజూ పసుపు నీటితో అభిషేకం చేయవచ్చు. ఫోటో ఉన్నవారు అయితే రోజూ పువ్వులు వాడుకోవచ్చు. విగ్రహం ఫోటో రెండూ లేని వారు ఇంట్లో ఏ అమ్మవారి రూపం ఉంటే ఆ తల్లి ఫోటో ముందు దీపాన్ని పెట్టి వారాహిగా దీపాన్ని ఆవాహన చేయవచ్చు.. దీపానికి చేసేవారు అభిషేకం ద్రవ్యా స్పూన్ లో అమ్మవారికి మంత్రం చదువుతూ చూపించి ఒక పాత్రలో ఉంచి అందులోనే దేవతా ఆచమనం నీళ్లు, చివరిగా అది తీర్థం గా సేవించావచ్చు. యంత్ర పూజ తెలిసిన వారు ప్రతి రోజు యంత్ర పూజ చేయాలి. మధ్యాహ్నం భోజనం చేయవచ్చు సాయంత్రం పూజకి మళ్ళీ స్నానం చేసుకుని పూజ చేయాలి. నైవేద్యం మీకు కలిగినదే పెట్టండి. ఇంకొకరితో పోటీ పడి అప్పులు చేసి ఆర్భాటాలు వద్దు భక్తితో చేస్తే చాలు.
