సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం జంగపల్లి, వీరారెడ్డి పల్లి గ్రామ శివారులో బండ మల్లన్న జాతర ఉత్సవాలు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రారంభమైంది. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా ఇక్కడ మల్లన్న దేవుడు విరాజిల్లుతున్నాడు. ఈ క్రమంలోనే స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చారు. అనంతరం ఎడ్ల బండ్ల ఊరేగింపులో పాల్గొని మాట్లాడారు. బండ మల్లన్న దయతో రైతు సోదరులతో పాటు ప్రజలంతా పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
ఏటా సంక్రాంతి పండుగ సందర్బంగా బండ మల్లన్న జాతర ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది వేల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ నేపథ్యంలోనే బండ మల్లన్న ఆలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు కావడం పట్ల దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం జాతర ఉత్సవాల్లో పాల్గొని మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.