డిసెంబర్ నెల వచ్చిందంటే ఈ ఆలయంలో సందడే సందడి..

కోణార్క్ దేవాలయం ఒక అద్బుతం. ఇక్కడి శిల్పకళా సౌందర్యం ప్రతి ఒక్కరినీ మంత్ర ముగ్దులను చేస్తుంటుంది. కోణార్క్ అనే పదంలో కోన అంటే ‘మూల’ అని, ‘ఆర్క్’ అంటే సూర్యుడు అని అర్థం. క్రీస్తుశకం 1250లో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ సూర్య దేవాలయాన్ని నరసింహదేవుడు నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ముస్లిం ఆక్రమణ దారులను ఓడించిన తరువాత నరసింహదేవుడు ఈ నిర్మాణం చేపట్టాడట. 15వ శతాబ్దంలో ఆక్రమణ దారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారు.

అప్పుడు ఆలయ పూజారులు సూర్యుడి విగ్రహాన్ని ఆక్రమణదారులకు దొరక్కుండా భద్రపరిచారట. అప్పట్లో ఆలయాన్ని ధ్వంసం చేశారట. ఆ తరువాత బ్రిటీషర్ల కాలంలో ఆలయ పునరుద్ధరణ కావించబడిందని చెబుతారు. ముఖ్యంగా డిసెంబర్ నెల వచ్చిందంటే ఇక్కడ కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ పేరిట వార్షిక నృత్యోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి సైతం పర్యాటకులు వస్తారు. 1986లో మొదలైన ఈ ఉత్సవం ఇప్పటికీ నిరాంటంకంగా కొనసాగుతోంది. అరుదైన ఈ నృత్య పండుగలో కళాకారులు వారి ప్రతిభను చాటుకుంటారు. అన్ని రకాల నృత్యాలతో పాటు ముఖ్యంగా ఒడిశి నృత్య సంప్రదాయం చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని సందర్శిస్తే అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

Share this post with your friends