కురుక్షేత్ర యుద్ధానికి ప్రధాన కారణాలు ఏంటంటే..

మహాభారతం అంటే మనకు గుర్తొచ్చేది కురుక్షేత్ర సంగ్రామం. ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతారు. ఈ యుద్ధంలోనే కౌరవులంతా మరణించారు. వారికి మద్దతుగా నిలిచిన వారంతా మరణించారు. కురుక్షేత్ర సంగ్రామం జరగకుండా చూసేందుకు చాలా మంది యత్నించారు కానీ ఎవరి ప్రయత్నమూ సత్ఫలితాన్నివవ్లేదు. చివరకు శ్రీకృష్ణుడు సైతం రాయబారం నడిపాడు. పాండవుల తరుఫున రాయబారానికి హస్తినకు వెళ్లాడు. చివరకు కన్నయ్య రాయబారం కూడా ఫలించలేదు. అసలు ఈ కురుక్షేత్ర యుద్ధానికి కారణమేంటో చూద్దాం.

కురుక్షేత్ర సంగ్రామం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగింది. కనీసం పాండవులకు ఐదు ఊళ్లు ఇవ్వమంటూ శ్రీకృష్ణ పరమాత్ముడే కౌరవుల వద్దకు వెళ్లినా వారు అంగీకరించలేదు. ఐదు ఊళ్లిచ్చినా యుద్దం జరిగేది కాదు. రాజ్యాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలాలన్న కౌరవుల కాంక్షే వారిని కురుక్షేత్ర యుద్ధానికి పురుగొల్పి నాశనం చేసింది. దాయాది సోదరులపై అసూయ పెంచుకుని తమ నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. మాయా జూదంలో ఓడించి పాండవులను అజ్ఞాత వాసానికి పంపినా కూడా కౌరవ సోదరుల పగ చల్లారలేదు. అజ్ఞాత వాసం ముగిసిన అనంతరం పాండవులకు రాజ్యంలో వాటా ఇవ్వడానికి దుర్యోధనుడు నిరాకరించాడు. దీంతో కురుక్షేత్ర యుద్ధం చేయక తప్పని పరిస్థితి వచ్చింది.

Share this post with your friends