వారణాసి జిల్లా మదన్‌పురాలో ఉన్న సిద్ధీశ్వర మహాదేవ ఆలయం 70 ఏళ్ల తర్వాత తెరిచి శుద్ధి చేసి తిరిగి మూసేశారని తెలుసుకున్నాం కదా. ఈ ఆలయంలో సిద్దీశ్వర మహాదేవుని శివలింగం కనిపించలేదు. అయితే దీనిపై ‘ధుంధే కాశీ’ సంస్థకు చెందిన అజయ్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఆలయంలో ప్రధాన శివలింగమైన సిద్దీశ్వర మహదేవ ఆచూకీ లభించలేదని.. అవి దొరకకున్నా మకర సంక్రాంతి తర్వాత ఆలయాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ఇక్కడ శిలా శివలింగ రూపంలో ఉండే సిద్ధీశ్వర్ మహాదేవుని ప్రతిష్టిస్తామని తెలిపారు. అనంతరం ఏడు రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తామన్నారు.
అనంతరం ఇద్దరు అర్చకులను నియమిస్తామని పూజలు కొనసాగిస్తామని శ్రీ కాశీ విద్వత్ పరిషత్ తెలిపింది. పూజారుల నియామకం బాధ్యతను అన్నపూర్ణ దేవాలయం నిర్వహిస్తుందని.. శ్రీ కాశీ విద్వత్ పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు ప్రారంభంకానున్నాయి. కాశీ అన్నపూర్ణమ్మ సకల జీవులకు ఆకలి తీర్చే తల్లి కాబట్టి ఈ ఆలయంలో రాగ భోగ ఏర్పాటు బాధ్యతను అన్నపూర్ణ ఆలయానికి అప్పగించారు. వైదిక పద్ధతిలో ఆలయ నిర్వహణ నిర్వహించనున్నారు. త్రికాల సంధ్య పద్ధతిలో పూజలు ఉండనున్నాయి. మదన్‌పురాకు చెందిన గోల్ చబుత్రా ముస్లింలు సైతం ఆలయంలో పూజలకు మద్దతు ఇస్తామని తెలిపారు.