ఈ ఆలయ చరిత్ర అత్యంత ఆశ్చర్యకరం.. అదేంటంటే..

మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలోని పృథ్వీపూర్ తహసీల్ ప్రాంతంలోని గ్రామ పంచాయితీ మడియాలో ఉన్న అచ్రు మాత ఆలయం గురించి మనం ముందే తెలుసుకున్నాం. ఇక్కడి అమ్మవారు భక్తులతో మాట్లాడి వారి కోరికలను నెరవేరుస్తుందని తెలుసుకున్నాం. ఈ ఆలయ చరిత్ర చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అదేంటంటే.. అచ్రు అనే ఒక పశువుల కాపరి నిత్యం తన గేదెలను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు. ఒకరోజు అతని గేదె తప్పిపోయిందట. దానిని వెదుక్కుంటూ అడవి మొత్తం గాలించాడట. కానీ దొరకలేదు.

గేదె కోసం వెదికి వెదికి అలసిపోయిన అచ్రు ఒక చెట్టు కింద కూర్చొన్నాడట. అక్కడే ఒక చెరువు కూడా ఉందట. ఆ బావిలో నుంచి అమ్మవారు ప్రత్యక్షమై నీ గెదె ఫలానా చోట ఉందని చెప్పి తాగడానికి నీరు ఇచ్చిందట. ఆ నీరు తాగుతున్న సమయంలో అతని కర్ర చెరువులో పడిపోయిందట. ఆ తరువాత అమ్మవారు చెప్పిన ప్రదేశానికి వెళ్లగా గేదెతో పాటు కర్ర కూడా కనిపించిందట. అప్పటి నుంచి రోజూ పశువుల కాపరి చెరువు వద్దకు వెళ్లి అమ్మవారిని పూజించడం ప్రారంభించాడట. ఈ విషయం అచ్రు గ్రామంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలన్నింటికీ వ్యాపించడంతో అక్కడి అమ్మవారికి ఆలయం నిర్మించారు. అక్కడి అమ్మవారిని పశువుల కాపరి పేరుతో అచ్రు మాతగా పిలుస్తున్నారు.

Share this post with your friends