సాక్ష్యాత్తు విష్ణుమూర్తియే గణేషుడి ఎదుట గుంజీళ్లు తీశాడు.. కారణమేంటంటే..?

విష్ణుమూర్తి అంతటి వాడు బొజ్జ గణపయ్య ముందు ఎందుకు గుంజీళ్లు తీయాల్సి వచ్చింది? అంటే దీని వెనుక పెద్ద కథే ఉంది. ఒకరోజు శివుడిని కలిసేందుకు విష్ణుమూర్తి కైలాసానికి వెళ్లాడట. అక్కడికి చేరుకోగానే శ్రీ మహావిష్ణువు తన చేతిలోని సుదర్శన చక్రంతో పాటు గద, ఇతర ఆయుధాలన్నింటిని ఒకచోట పెట్టేసి శివుడి వద్దకు వెళ్లిపోయాడట. ఇక శివుడితో ముచ్చట్లలో విష్ణుమూర్తి మునిగిపోయాడట. ఆ సమయంలో ఆడుకుంటూ ఆడుకుంటూ బాల గణపతి.. బంగారు కాంతులతో వెలిగిపోతున్న ఆ సుదర్శన చక్రాన్ని నోట్లో పెట్టుకుని మింగేశాడట.

ఆ తరువావత మౌనంగా తన ఆటల్లో మునిగిపోయాడట. కొద్దిసేపటి తర్వాత విష్ణుమూర్తి తన వస్తువుల్లో అన్నీ ఉన్నాయి కానీ సుదర్శన చక్రం లేదంటని విస్తుబోయాడట. ఇక సుదర్శన చక్రం కోసం వెదకడం ప్రారంభించాడట. అది చూసిన గణపయ్య ఏమైందని విష్ణుమూర్తిని ఆరా తీశాడట. ఇలా తన సుదర్శన చక్రం కనిపించడం లేదని చెప్పగానే అది ఇంకెక్కడుంది? తాను ఆరగించానని చెప్పాడట బొజ్జ గణపయ్య. దానిని తిరిగి ఇవ్వమని బతిమిలాడినా కూడా గణేషుడు మిన్నకుండి పోయాడట. అప్పుడు విష్ణుమూర్తి గణేషుడి ఎదుట గుంజీళ్లు తీయడం ఆరంభించాడట. అది చూసిన గణపయ్య పొట్ట చెక్కలయ్యేలా నవ్వడంతో సుదర్శన చక్రం బయటకు వచ్చిందట.

Share this post with your friends