
మొత్తానికి పాదరక్షల గోడు విన్న శ్రీ మహావిష్ణువు అద్బుతమైన వరం ఇచ్చాడు. త్రేతాయుగంలో పాదుకా పట్టాభిషేకం చేయిస్తానని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే.. పాదరక్షలకు త్రేతాయుగంలో భరతుడు నెత్తిన పెట్టుకుని తీసుకెళ్లి మరీ పాదుకా పట్టాభిషేకం చేశాడు. అప్పుడు పాదుకలు తమ ఉన్నత స్థితిని తలచి ఎంతగానో సంతోషించాయి. భరతుడు నిత్యం సింహాసనం వద్దకు రాగానే ముందుగా పాదుకలకు నమస్కరించిన మీదటే తదుపరి కార్యాచరణలోకి వెళ్లేవాడు. అలా నమస్కరించినప్పుడల్లా ఆయన శిరస్సుపై ఉన్న కిరీటం సిగ్గుతో తల దించుకునేది.
తన తప్పును గ్రహించిన కిరీటం.. పాదుకలను అంతలా అవమానిస్తూ మాట్లాడినందుకు పశ్చాత్తాపం చెందింది. దీని వలన తెలిసొచ్చే నీతి ఏంటంటే.. ఎప్పుడూ ఎవ్వరినీ తక్కువగా చూడకూడదు. ఎప్పుడు ఎవరికి ఎలా పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయో చెప్పలేం. ప్రతి ఒక్కరికీ ఒకరోజంటూ వస్తుంది. అది వచ్చే వరకూ వెయిట్ చేస్తూ ఉండాలి. కష్టసుఖాలు ఏవీ కూడా శాశ్వతం కాదు.. అన్నీ తాత్కాలికమే. కష్టానికి కృంగిపోకూడదు.. సుఖానికి పొంగిపోకూడదు. పిల్లలకు సైతం ఇలాంటి పాఠాలు నేర్పిస్తే జీవితంలో గెలిపోటములను సమానంగా స్వీకరిస్తారు.
