రుద్రాక్షను ధరిస్తే కలిగే ప్రయోజనాలేంటంటే..

చాలా మంది తమ ఒంటిపై రుద్రాక్ష ఉంటే మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రుద్రాక్షను ధరిస్తూ ఉంటారు. మహా శివుని కన్నీటి నుంచి రుద్రాక్ష ఉద్భవించిందని చెబుతూ ఉంటారు. అందుకే శివభక్తులకు రుద్రాక్ష మరింత ప్రత్యేకం. నిజానికి కూడా రుద్రాక్షను ధరిస్తే మనసులోని ఆందోళన తొలిగి స్పష్టత లభించడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఉండవని నమ్ముతూ ఉంటారు. అలా రుద్రాక్షను ధరించేటప్పుడు కొన్ని నియామాలను కచ్చితంగా పాటించాలి. అలాగే రుద్రాక్షను ధరించి ఏదైనా మంత్రాన్ని జంపిస్తే.. అది కోటి సార్లు చదివిన ఫలితాన్నిస్తుందట.

ఇక రుద్రాక్షలు ధరించి మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే.. అకాల మృత్యువు ఉండదట. పైగా అన్ని రకాల రోగాల నుంచి విముక్తి లభిస్తుందట. అయితే మృత దేహం వద్దకు వెళ్లే సమయంలో లేదంటే దహన సంస్కారాల సమయంలోనూ.. మద్యం సేవించే ప్రదేశంలోనూ రుద్రాక్షను ధరించకూడదరంటారు. అలాగే బిడ్డ పుట్టినప్పుడు.. పడుకునే ముందర రుద్రాక్షను ధరించకూడదని అంటారు. అయితే కొందరు మాత్రం వీటన్నింటినీ అపోహలేనని కొట్టి పడేస్తుంటారు. రుద్రాక్షను ఎప్పుడూ ధరించవచ్చని అంటారు. రుద్రాక్షణను ధరించిన వారికి మనసుపై నియంత్రణ ఉంటుందట. రుద్రాక్షను ధరించిన వారికి జ్ఞాపకశక్తితో పాటు స్వీయ శక్తి పెరుగుతుందని అంటారు.

Share this post with your friends