ఆ విష్ణుమూర్తే శ్రీరామచంద్రునిగా.. భద్రాద్రి క్షేత్రం కధ ఇదే..!

దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరామనవమికి సిద్ధమవుతోంది. శ్రీరామనవమికి భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచలానికి తరలి వస్తుంటారు. ఎండను కూడా లేక్క చేయక వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మరీ కల్యాణాన్ని తిలకిస్తారు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి ప్రజలకు సీతారాములపై ఉన్న భక్తి.. అలాగే భద్రాచల స్థల పురాణ శక్తి. భద్రాద్రి క్షేత్రం వెలియడానికి కారణం భద్రుడు. ఆయన విష్ణుమూర్తికి పరమ భక్తుడు. స్వామివారి సాక్షాత్కారం కోసం కఠోర తపస్సు చేశాడు. భద్రుడి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో దర్శనమిచ్చాడు.

అనంతరం భద్రుడు గోదావరి నదికి అభిముఖంగా ఒక ప్రదేశంలో పర్వతంగా మారిపోతాడు. అదే భద్రాద్రి.. తదనంతరం ఆ ప్రదేశానికి భద్రాచలం అని పేరు స్థిరపడిపోయింది. ఇక్కడి ఆలయంలో శ్రీరామ చంద్రమూర్తి శంఖచక్రధారిగా ఉంటాడు. ఆయన మూలవిరాట్టును చూస్తుంటే అలానే భక్తి భావంతో ఉండిపోతాం. భద్రుని తపస్సుకు మెచ్చిన విష్ణు మూర్తి వైకుంఠం నుంచి శంఖు చక్రాలతో దర్శనమిచ్చాడట. అందుకే రాముల వారు భద్రాచలంలో శంఖు చక్రాలతో నారాయణుడి మాదిరిగా కనిపిస్తాడు. స్వామివారు ధనుర్భాణాలతో శ్రీరామచంద్రమూర్తిగా సైతం భక్త కోటిని కటాక్షిస్తూ ఉంటాడు.

Share this post with your friends