ఆంజనేయ స్వామి స్వయంభువుగా వెలిసిన ఆలయం పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంది. ఈ ఆలయం ఈనాటిది కాదు. 1500 ఏళ్ల క్రితం నాటిదట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే… శ్రీరాముడు వనవాస దీక్ష చేస్తున్న సమయంలో సీతా సమేతుడై లక్ష్మణుడితో కలిసి ఇక్కడికి వచ్చి విడిది చేశాడని స్థల పురాణం చెబుతోంది. భారత్, పాక్ విడిపోయినప్పుడు చాలా మంది హిందువులు పాక్‌కు వెళ్లిపోయారు. వారంతా ఈ స్వామి వారి క్షేత్రాన్ని నిత్యం దర్శంచుకుంటూ ఉంటారు. ఇక పంచముఖ ఆంజనేస్వామి వారి విగ్రహం హనుమతో పాటు నరసింహ, ఆదివరాహ, హయగ్రీవ, గరుడ ముఖాలతో దర్శినమిస్తూ ఉంటుంది.
ఇక ఈ ఆంజనేయస్వామి విగ్రహం ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటుంది. నిత్యం భక్తులకు అభయం ఇస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన భక్తులు ఎవరైనా సరే.. మనసులో కోరిక కోరుకుని మూలవిరాట్ ఉన్న ప్రాంగణంలో 21 ప్రదక్షిణలు చేస్తే తప్పక నెరవేరుతుందట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కొన్నేళ్ల క్రితం ఆలయ అభివృద్ధి పనులు చేపట్టగా.. ఆలయ తవ్వకాల్లో చాలా పురాతన విగ్రహాలు బయల్పడ్డాయట. వాటిని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయ ప్రాంగణ తవ్వకాల్లో పురాతనమైన అనేక విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని ఆలయప్రాంగణంలో ప్రతిష్టించారు.