అందుకే కేతకీ పుష్ఫం పూజకు పనికి రాదట..

మొత్తానికి బ్రహ్మ, విష్ణుమూర్తి.. జ్యోతి స్తంభం ఆది, అంతం చూసేందుకు వెళ్లి వచ్చారు. విష్ణుమూర్తి అయితే తను ఆదిని కనుగొనలేకపోయానని సిన్సియర్‌గా చెప్పాడు. అయితే బ్రహ్మం మాత్రం తను చూసి వచ్చానని చెప్పాడు. సాక్ష్యంగా కేతకీ పుష్పాన్ని చూపించాడు. జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మతో బ్రహ్మ నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు. నీకు భూమియందు పూజ లేకుండుగాక! అని పరమేశ్వరుడు శాపమిచ్చాడు. కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు. మహావిష్ణువు నేను చూడలేదని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి. ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు.

అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం ‘నా పూజయందు వినిమయం అవకుండుగాక!’ అని శాపమిచ్చాడు శివుడు. అప్పుడు కేతకీ పుష్పం తనకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు కానీ తన భక్తులయిన వారు మాత్రం తనను తలలో ధరిస్తారు. వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను’ అని చెప్పాడు. అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే మహాశివరాత్రి.

Share this post with your friends