రావణుడి చావుకు ఆ శాపమే కారణమట..

రావణుడు రాక్షసుడిగానే మనకు తెలుసు. ఆయనలో చాలా సుగుణాలున్నాయి. రావణుడు గొప్ప శివభక్తుడు. శివ తాండవ స్తోత్రాన్ని రచించారు. అంతటి అపర భక్తుడికి చంద్రహాస అనే అజేయ ఖడ్గాన్ని శివుడు బహుమతిగా ఇచ్చాడు. రావణుడి భక్తికి సంతోషించిన శివుడు అతనికి చంద్రహాస అనే అజేయ ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చాడు. రావణుడు గొప్ప యోధుడే కాకుండా వేదాలు, జ్యోతిష్య శాస్త్ర పండితుడు. బ్రహ్మ దేవుడి కోసం వెయ్యేళ్ల పాటు తపస్సు చేసి అమరత్వాన్ని వరంగా పొందాడు. ఆయన నాభిలో అమృతభాండం ఉంది.

అలాగే బ్రహ్మ దేవుడు నుంచి రావణుడు చావులేని వరం కోరాడు. తనకు మానవుడు తనను ఎలాగూ సంహరించలేడు కాబట్టి అసురుడు, కిన్నరుడు లేదా గంధర్వుల చేతిలో మరణం లేకుండా వరం పొందాడు. మరి అలాంటి రావణుడికి చావు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. రావణుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన అనరణ్యుడిని వధించాడు. అయితే అనరణ్యుడు మరణశయ్యపై ఉండగా.. రావణుడి సంహారం తమ వంశంలోని దశరథ కుమారుడు చేతిలో జరుగుతుందని శపించాడు. ఆ శాప ఫలితంగానే రాముడు చేతిలో రావణుడు హతమయ్యాడు.

Share this post with your friends