శబరిమలలో థంక అంగీ ఊరేగింపు

శబరిమలలో మండల పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ‘థంక అంగీ ఊరేగింపు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. థంక అంగీ ఊరేగింపు అయ్యప్ప భక్తులకు చాలా ముఖ్యమైనది. థంక అంగీ అంటే ఏంటంటే. శబరిమల పుణ్యక్షేత్రంలో కొలువైన అయ్యప్ప విగ్రహానికి అలంకరించే పవిత్ర బంగారు వస్త్రం. 1973లో ట్రావెన్‌కోర్ సంస్థానానికి ఆఖరి పాలకుడు శ్రీ చితిర తిరునాళ్ బలరామవర్మ థంక అంగీని స్వామివారికి సమర్పించారు. ఈ థంక అంగీ బరువు 400 కిలోల కంటే ఎక్కువే. థంక అంగీలో అయ్యన్ కిరీటంలో బంగారు పీఠం ఉంటుంది. తంకా వస్త్రంలో పీఠం, పాదుకలు, చేతి తొడుగులు, ముఖం, కిరీటం కూడా ఉంటాయి.

వృశ్చికరాశిలో మండల పూజ కార్యక్రమంలో అయ్యప్పకు థంక అంగీతో అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. మండల పూజా కార్యక్రమానికి నాలుగు రోజుల ముందు అరన్ముల పార్థసారథి ఆలయం వద్ద తంగ వస్త్రం ఊరేగింపును ప్రారంభిస్తారు. పార్తసారధి ఆలయం నుంచి తంగ వస్త్రం సన్నిధానానికి బయలుదేరుతుంది. ఈ రథ యాత్రను థంక అంగీ రథ యాత్ర అని పిలుస్తారు.ఈ ఊరేగింపునకు వివిధ ఆలయాల వద్ద స్వాగత కార్యక్రమాలు చేపడతారు. ఆ స్వాగత సత్కారాల అనంతరం రథ యాత్ర స్వామివారి సన్నిధానానికి చేరుతుంది. 18వ మెట్టు, గర్భగుడి, ధ్వజస్థంభం సహా శబరిమల ఆలయం మాదిరిగానే తయారు చేసిన రథంలో అయ్యప్ప స్వామి కొలువుదీరతారు. దేవస్థానానికి చేరుకున్న థంక అంగీని దేవస్వం ప్రతినిధులు లాంఛనంగా స్వీకరించి సన్నిధానానికి తీసుకొస్తారు. 18వ మెట్టు ఎక్కి సోపానం వద్దకు చేరుకోగానే తంత్ర, మేల్శాంతి థంక అంగీ వస్త్రాన్ని అందుకుంటారు. ఆ తరువాత అయ్యప్ప స్వామికి దీపారాధన చేసి మండల పూజలు నిర్వహిస్తారు.

Share this post with your friends