మే 22న తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది.
తరిగొండ నివాసులైన కృష్ణయ్య, మంగమ్మ దంపతుల గారాలపట్టి వేంగమాంబ వేంకటేశ్వరస్వా మికి మొక్కుకున్న తర్వాత జన్మించిన పుత్రిక కాబట్టి వెంగమ్మ అని పేరుపెట్టుకున్నారు. ఆంగ్లశకం 1730 ఆమె జనన సంవత్సరం. ఆమె అన్నమయ్యకు వలెనే నృసింహుని ఉపాసించింది. ఆ ఉపాసనా ఫలితంగా వేంకటేశ్వర స్వామితో అనుబంధాన్ని పొందింది. తిరుపతిలో చిరకాలం నివసించింది. వేంకటాచల మహత్యం, అష్టాంగయోగసారం వంటి రచనలు చూసింది. ఆమెలోని భక్తిమార్గాన్ని చూసి వెంగమ్మను అనేకులు ‘మహాయోగిని’గా భావించారు. ‘వెంగమాంబ’ అని గౌరవంగా పిలిచారు. తిరుమల శ్రీనివాసునికి రాత్రిసమయంలో చిట్టచివరి సేవగా హారతినిస్తారు. దానికి తరిగొండ వేంగమాంబ ముత్యాల హారతి అని పేరు. కవయిత్రిగా, యోగినిగా వేంకటేశుని భక్తులలో వేంగమాంబకు విశిష్టస్థానం ఉంది.