ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఇవాళ ఏం జరగనుందో తెలిస్తే..

దక్షిణాయనం ఎప్పుడు ప్రారంభమవుతుంది? దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు కాబట్టి ఇది ఎప్పుడో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాగే ఇవాళ ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. వాస్తవానికి ఏడాదిలో ఆరు నెలల పాటు ఉత్తరాయణం.. ఆరు నెలల పాటు దక్షిణాయనం ఉంటుంది. గ్రహాలకు అధి దేవతగా సూర్యుడిని పేర్కొంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం.. గమనాన్ని మార్చుకుని సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయణంగా పరిగణిస్తారు. మరి దక్షిణాయనం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటారా? జూలై 6వ తేదీ నుంచి. ఆ రోజున సూర్యుడు తన గమనాన్ని మార్చుకుంటాడు.

ఇక సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వైపు తన పయనాన్ని ప్రారంభించగానే వేసవి కాలం వెళ్లిపోయి వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఇవాళ ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఇవాళ ఏడాదిలోనే అతి దీర్ఘ రాత్రి. శుక్రవారం పగటి సమయం 13 గంటల 42 నిమిషాలు.. రాత్రి సమయం 10 గంటల 18 నిమిషాలు ఉంటుంది. ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశికి చాలా దగ్గరలో ఉన్నాడు. ఇవాళ మరో ఆసక్తికర విషయం జరగనుంది. అదేంటంటే.. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో సూర్యుడు నడినెత్తికి వస్తాడు. ఆ సమయంలో మనిషి నీడ కనిపించదు. ఇవాళ సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి అడుగు పెడతాడు కాబట్టి రుతుపవనాలకు ఆటంకం తొలగి అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందట.

Share this post with your friends