పూరి జగన్నాథుడి సుదర్శన చక్రం, పక్షులు అన్నీ మిస్టరీయే..

పూరి జగన్నాథుడి ఆలయం వింతలూ విశేషాలకు అడ్డా అని కూడా చెప్పవచ్చు. ఇక్కడి శ్రీకృష్ణుడి మహిమ ఏంటో కానీ స్వామివారి ఆలయంలో వింతలూ విశేషాలకు కొదువ లేదు. ఆలయం పైన సుదర్శన చక్రం ఉంటుంది. ఇది 20 అడుగుల ఎత్తు.. ఒక టన్ను బరువు ఉంటుంది. దీనిలో వింతేముంది అంటారా? పూరిలోని ఏ మూల నుంచి చూసినా కూడా ఈ సుదర్శన చక్రం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అసలు ఈ సుదర్శన చక్రాన్ని ఎలా పెట్టారనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

మనం ఎక్కడ నిలబడినా మాత్రమే కాకుండా ఎలా నిలబడినా కూడా మనల్ని ఆ చక్రం చూస్తున్నట్టే కనిపిస్తుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఆలయంపై నుంచి పక్షులు కానీ.. విమానాలు కానీ ఎగురలేవు. భారత దేశంలోని ఏ దేవాలయంలోనూ ఇలాంటి వింతను చూడలేము. కనీసం ఒరిస్సా ప్రభుత్వం నో ఫ్లైయింగ్ జోన్‌గా కూడా ప్రకటించలేదు. అయినా సరే విమానాలు ఆ ఆలయం పైనుంచి ఎగుర లేవు. అయినా సరే పక్షులు కూడా ఎగురవంటే అదంతా కన్నయ్య మహిమేనని అంతా అంటారు. ఇది ఇప్పటికీ మిస్టరీయే..

Share this post with your friends