ప్రయాగ్ రాజ్‌లో ఏర్పాటు చేసిన నమూనా ఆలయం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. ఇక్కడి స్వామివారికి సైతం తిరుమలేశుని మాదిరిగా నిత్య కౌైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాగా జనవరి 18వ తేదీన ఉదయం 11 నుండి 12 గంటలకు శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మహా కుంభమేళాలో స్నానమాచరించిన వారంతా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అచ్చం తిరుమల శ్రీ మలయప్ప స్వామివారిని పోలిన ఆలయం మాదిరిగా ఉండటంతో సాక్షాత్తు తిరుమలేశుని దర్శించుకున్నట్టుగా ఫీలవుతున్నారు. నమూనా ఆలయంలో భక్తులు విరాళాలు సమర్పించేందుకు వీలుగా టీటీడీ కీయోస్క్ మిషన్ (సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్) ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ద్వారా భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రూ.1 నుండి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని టీటీడీకి విరాళంగా ఇవ్వవచ్చు.