ఘనంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు జూలై 31న ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పవిత్రోత్సవాలు జూలై 30నే అంకురార్పణ జరిగింది. పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 31వ తేదీ యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగస్ట్ 1న పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాలు శుక్రవారం సాయంత్రం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ముందుగా స్వామివారిని వేద పండితులు ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు.

ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించారు. తరువాత ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ‌ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగ‌ర‌త్న‌, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends