జూలైలో తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో విశేష ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 6 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 30 నుంచి ఆగస్టు 2వ తేదీ వ‌ర‌కు ప‌విత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.

జూలై 6, 13, 20, 27వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
జూలై 5న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రాత్రి 7 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వహిస్తారు.

జూలై 6న పున‌ర్వసు న‌క్షత్రాన్ని పుర‌స్కరించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వహిస్తారు.

జూలై 21న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

జూలై 16న ఆణివార ఆస్థానం

జూలై 30 నుంచి ఆగస్టు 2వ తేదీ వ‌ర‌కు ప‌విత్సోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.

Share this post with your friends