వేసవి కాలంలో తిరుమల శ్రీవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఏడాది కాస్త భక్తుల రద్దీ తగ్గింది. శనివారం శ్రీవారి దర్శనాలకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారిని 81,212 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 41,690 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. ఇక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి.
అయితే కొన్ని ప్రత్యేక దినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మే నెలలో ఏ రోజున ఏ ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారో చూద్దాం.
మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.
మే 4న సర్వ ఏకాదశి.
మే 10న అక్షయతృతీయ.
మే 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.
మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.
మే 22న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి.
మే 23న శ్రీ అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి