ఈ మాస శివరాత్రి మరింత ప్రత్యేకం.. ఎన్ని అరుదైన యాదృచ్చికాలంటే..

మాస శివరాత్రి పవిత్ర పండుగ ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశి తిథిన జరుపుకుంటారు. మాస శివరాత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది శివునికి అంకింతం చేయబడిన రోజు. ఈ రోజున శివపార్వతులను పూజిస్తే చాలా మంచిది. జేష్టమాసంలో వచ్చే ఈ మాస శివరాత్రి మరింత ప్రత్యేకం ఎందుకంటే చాలా అరుదైన యాదృచ్చికాలున్నాయి. అసలు జేష్ట మాసంలో మాస శివరాత్రి ఎప్పుడంటే.. జూలై 4వ తేదీన. ఈ రోజే భద్రయోగం ఏర్పడనుందట. ఈ యోగంలో శివపార్వతులను పూజిస్తే కోరికలు నెరవేరుతాయట. ఇక ఇదే రోజున వృద్ధి యోగం కూడా ఏర్పడనుందట.

ఈ వృద్ధి యోగం జూలై 4న ఉదయం 7 గంటలకు ప్రారంభమై మర్నాడు జూలై 5న సాయంత్రం 5:14 గంటల వరకూ కొనసాగుతుంది. ఈ సమయంలో శివుడిని ఆరాధిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయట. మాస శివరాత్రి రోజున మరో విశేషం ఏంటంటే.. మృగశిర నక్షత్రం ఉండనుంది. ఇది అన్ని రకాల శుభాలకు సంకేతమట. కాబట్టి ఈ నక్షత్రంలో శుభకార్యాలను చక్కగా ప్రారంభించవచ్చు. ఇది మాత్రమే కాదు.. అభిజీత్ ముహూర్తం కూడా ఇదే రోజున రానుంది కాబట్టి ఈ సారి మాస శివరాత్రి మరింత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. ఈ అభిజిత్ ముహూర్తం పూజలు, శుభకార్యాలకు మరింత అనువైన సమయం. ఇక ఈ ముహూర్తం ఏ సమయంలో ఉంటుందంటే.. జూలై 4వ తేదీ మాస శివరాత్రి రోజున.. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:53 వరకూ ఉంటుంది.

Share this post with your friends