న్యాయాధిపతి శనీశ్వరుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు. 2025 వరకూ శనీశ్వరుడు ఈ రాశిలోనే ఉంటాడు కాబట్టి కుంభ రాశితో పాటు మకర, మీనరాశులకు ఏలిన నాటి శని ప్రభావం ఉండనుంది. జీవుల కర్మలను అనుసరించి మంచి చెడులను శనీశ్వరుడు ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి ఈయనను న్యాయాధిపతి అని కూడా అంటారు. ఈయన చాలా నెమ్మదిగా నడిచే గ్రహమట. అయితే కొన్ని రాశులకు మాత్రం అన్ని విధాలుగా అదృష్టం పట్టనుందట. అవేంటో చూద్దాం.
సింహరాశివారిపై శనీశ్వరుడి చల్లని చూపు ఉంటుందట. పెళ్లి కాని వారికైతే కోరుకున్న యువతి భార్యగా లభిస్తుందట. వ్యాపార రంగంలోని వారికి లాభాలే లాభాలట. జీవితం సుఖ సంతోషాలతో గడిపోతూ ఉంటుంది. డబ్బుకు ఎలాంటి కొదువ ఉండదు. బంగారాన్ని సైతం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక వృషభ రాశి వారి పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ విషయంలోనూ నష్టానికి చోటుండదు. పెట్టుబడులు పెట్టినా కూడా అద్భుతంగా ఉంటుందట. డబ్బుకు ఏమాత్రం లోటుందట.