రోళ్లు పగిలే కాలం వచ్చేసింది.. ఈ మొక్కలు నాటారో అదృష్టమే అదృష్టం..

రోహిణి కార్తెలో రోళ్లు కూడా పగులుతాయట. ఈ రోహిణి కార్తె నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఇది జూన్ 8వ తేదీ నాటికి ముగియనుంది. అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలి? అంటే.. దానధర్మాలతో పాటు మూడు రకాల చెట్లను నాటడం.. లేదా పూజించడం వంటివి చేయాలట. మొక్కలు నాటడం వలన మన అదృష్టం కలిసి రావడంతో పాటు శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే రావి చెట్టును పూజించడం ద్వారా చాలా మంచి జరుగుతుందట. రావి చెట్టును నాటడం వలన సూర్యరశ్మి నుంచి కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది. సూర్యాగ్రహాన్ని శాంతిపజేయడంతో పాటు జాతకంలో సూర్యుని కారణంగా ఎదురయ్యే ప్రతికూలతల నుంచి సైతం బయటపడతామట.

ఈ రావిచెట్టులో సకల దేవతలు ఉంటారట. కాబట్టి రోహిణి కార్తెలో ఒక్క రావి చెట్టును నాటినా దేవతలు సంతోషిస్తారట. ఇక జమ్మి చెట్టు శనీశ్వరుడికి చాలా ఇష్టమైన చెట్టు అని భావిస్తుంటారు. దీనిని నాటడం వలన శనీశ్వరుడి అనుగ్రహం లభించి శని దోషం తొలుగుతుందట. అలాగే జాతకంలో సూర్య గ్రహ స్థానం కూడా బలపడుతుందట. ఈ క్రమంలోనే తులసి మొక్కను నాటినా చాలా మంచి జరుగుతుందట. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. రోహిణి కార్తెలో తులసి మొక్కను నాటితే జాతకంలో ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుందని నమ్మకం.

Share this post with your friends